టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి తనపై పరువు నష్టం దావా వేయడం పై మండిపడ్డారు . అయితే దీనికి బదులుగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పందించారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు రమణదీక్షితులు చెప్పినవన్నీ అసత్యాలే కనుక శ్రీ వెంకటేశ్వరుడికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు . ఇరవై ఐదేళ్ల పాటు ప్రధాన అర్చకుడి పదవిలో ఉన్న ఆయన అసత్యాలు చెప్తున్నారని , తిరుమల వ్యవహారం పై ,శ్రీవారి నగలకు సంబందించిన అంశాలపై ఆయన రాసిచ్చిన లేఖలు సంబంధిత కమిటీల వద్ద , టీటీడీ వద్ద ఉన్నాయని , వీటన్నింటిని తాము న్యాయస్థానం ముందు ఉంచుతామని బోండా ఉమా అన్నారు .

రమణ దీక్షితులు తాను ఈ వివాదం పై దీక్షకు దిగుతానని ప్రకటించిన విషయం తెలిసినదే . ఈ విషయం పై బోండా ఉమా స్పందిస్తూ , దీక్షకు దిగడం వలన అవాస్తవాలు వాస్తవాలు కావని , దీక్షలు చేయడం ద్వారా ఎవరిని మభ్య పెట్టలేరని అన్నారు . స్వామి వారి భక్తులకు ఇప్పటికే వాస్తవాలు తెలిసిపోయాయన్నారు . ఇంకా మాట్లాడుతూ రమణ దీక్షితులు దీక్షకు దిగే ముంది ఆయనకు టీటీడీ ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పాలి లేదా న్యాయపరంగా కోర్టులో ఎదుర్కోవాలని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments