100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. 1 బిగ్ హౌస్.. బిగ్ బాస్ 2′ అంటూ ఈనెల 10న బిగ్‌బాస్‌ సీజన్‌ 2ని ప్రారంభించిన నేచురల్ స్టార్‌ నాని అదరగొట్టేస్తున్నాడు. ఏదైనా జరగొచ్చు రెడీగా ఉండడంటూ ఆసక్తి రేపిన నాని బిగ్‌బాస్‌-2ను సక్సెస్‌ దిశగా నడిపిస్తున్నాడు. మొదట బిగ్‌బాస్‌ పట్ల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ షోను చాలా మంది చూస్తున్నారు.

తొలి వారం ఈ కార్య‌క్ర‌మం అత్యధికంగా టీఆర్‌పీ రేటింగ్స్‌ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ షో ప్రతి శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ, శుక్ర వారాల్లో రాత్రి 9.30 గంటలకు స్టార్‌ మాటీవీలో ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. బీఏఆర్సీ గణాంకాల ప్ర‌కారం సీజ‌న్ 2 లాంచింగ్ ఎపిసోడ్‌కి టీఆర్పీ రేటింగ్‌ 15.05 వచ్చింది. వీక్ డేస్‌లో 7.93గా న‌మోదు అయింది. సీజన్‌-1లో జూ.ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉన్నప్పుడు మొదటి వారంలో వచ్చిన రేటింగ్స్‌కు ఇది కాస్త తక్కువే అయినప్పటికీ ఈ షో పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని తగ్గకుండా చేశాడు నేచురల్‌ స్టార్‌ నాని.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments