ఎమ్మెల్యే పై మైనింగ్ మాఫియా దాడి …

562

పంజాబ్ లోని రోపార్ నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే అమర్ జీత్ సింగ్ సండోయ పై మైనింగ్ మాఫియా దాడికి పాల్పడింది . స్థానిక బీహరా గ్రామానికి సమీపంలో కొందరు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారనే సమాచారం ఆయనకు అందింది . దీంతో, మీడియా ప్రతినిధులను తన వెంట తీసుకుని అమర్ జీత్ సింగ్ తన వాహనంలో అక్కడికి వెళ్లారు . ఈ సమాచారం ముందుగానే తెలుసుకున్న మాఫియా ముఠా, అక్కడ తవ్వకాలు జరుపుతున్న యంత్రాలు, పరికరాలను వేరేచోటకు తరలించారు . అమర్ జీత్ సింగ్ అక్కడికి చేరుకోగానే మాఫియా సభ్యులు రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు . ఎమ్మెల్యే గన్ మెన్ లపై కూడా దాడి చేశారు . ఈ ఘటనలో అమర్ జీత్ సింగ్  ఛాతీకి స్వల్పగాయాలయ్యాయి . కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here