బుధవారం జరిగిన మీడియా సమావేశం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా చంద్రబులో అసహనం పెరిగిపోయిందని అన్నారు . ఏ ఒక్కరూ కూడా తాను దళితుడిగా పుట్టాలని కోరుకోడని గతంలో చంద్రబాబు అన్నారని , చిన్నకులాల వాళ్ళంటే ఆయనకు చులకన భావం ఉందని ఎంపీ పేర్కొన్నారు . “మత్స్యకారులపై మీ అంతు చూస్తానని చంద్రబాబు అన్నదాన్ని బట్టి చూస్తే ఆయన ఏ మేర అహంకారం ఉందొ అర్ధం చేసుకోవచ్చని , నాయీబ్రాహ్మణులు కనీస వేతనాలు అడిగితే కళ్ళు ఎర్రజేసి వాళ్ళపై చిందులేస్తారా ” అని నిప్పులు చెరిగారు . చిన్న కులాల ఓట్లు మాత్రం చంద్రబాబుకు కావాలని , కానీ వారి బాగోగులు మాత్రం  పట్టించుకోరని , అసలు చంద్రబాబులో మానవత్వం ఉందా అని వరప్రసాద్ ఆవేదన చెందారు .

బీజీపీ పై తాను యుద్ధానికి సిద్ధమని చెప్పిన బాబు డిల్లీ వెళ్లి మాత్రం చతికిలబద్దారని ఎగ్దేవా చేశారు . దీని బట్టి మోదీ అంటే బాబుకు ఎంత భయం ఉందొ అర్ధమవుతోందన్నారు . 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి చెప్పిన హామీలన్నీ నెరవేర్చేవారని ఉండాలని , ఆయనకు కనీస రాజకీయ జ్ఞానం కూడా లేదని మండిపడ్డారు . ఇంకా మాట్లాడుతూ దళితుల విలువ , ప్రజాస్వామ్యం విలువ , ఓటు విలువ త్వరలో చంద్రబుకు తెలుస్తాయని అన్నారు . వై ఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేర్చాలని వై ఎస్ జగన్ రాజకీయాలలోకి వచ్చారని , ప్రజల మద్దతుతో కచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఎంపీ వరప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments