తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ మరోసారి నోటికి పనిచెప్పారు. తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను ‘‘ఎన్‌కౌంటర్’’ చేసేస్తామని హెచ్చరించారు . మమత నేతృత్వంలోని టీఎంసీకి విధేయులమై ఉంటామని తామేమీ బాండు రాయలేదన్నారు . తమ వద్ద బుల్లెట్లకు కొదవలేదనీ ,తల్చుకుంటే ప్రతిచోటా శవాలు తేలతాయంటూ దిలీప్ ఘోష్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు . జల్పైగురిలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఇటీవల ఇక్కడ బీజేపీ ఓట్లకు భారీగా గండిపడిన నేపథ్యంలోనే ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం . టీఎంసీని గద్దెదించి పశ్చిమ బెంగాల్లో అడుగుపెట్టాలని బీజేపీ యోచిస్తుండడంతో ఆ పార్టీకి జల్పైగురి కీలకంగా మారింది .
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments