కొన్ని రోజుల క్రిందట పరీక్షలో మంచి ర్యాంకు సాధించలేదని ఒక అమ్మాయి అబిడ్స్ ప్రాంతంలో బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసినదే . ఆత్మహత్యకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . ఇప్పుడు మళ్ళీ అదే తరహా సంఘటన హైదరాబాదులోని ముషీరాబాద్ లో చోటుచేసుకుంది . వివరాలలోకి వెళితే గంగాపుత్రకాలనీలోని బీసీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఓ విద్యార్ధిని హాస్టల్ భవనం పై నుండి దూకింది . వెంటనే హాస్టల్ నిర్వాహకులు ఆమెను ఆసుపత్రికి తరలించినా లాభం లేక పోయింది . చికిత్స పొందుతూ ఆ విద్యార్ధిని మరణించింది .

ఆ విద్యార్ధిని పేరు సనా అని , ఆమె పెద్దపల్లి జిల్లా రొంపికుంట కు చెందినట్టుగా పోలీసులు గుర్తించారు . ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు . ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments