యంగ్ హీరో తో శ్రుతి హాసన్ …

706

లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలికా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు నటి శ్రుతి హాసన్ . స్టార్ హీరో సినిమాలలో అవకాశాలు వచ్చినా సినిమాలు విజయం సాధించకపోవడంతో ఆమె కెరీర్ కష్టాలలో పడింది . అందువల్లనే ఆమె సినిమాలు తగ్గించారు . గత సంవత్సర కాలంగా ఆమె ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు .

అయితే ఇప్పుడు శ్రుతి హాసన్ స్పీడు పెంచి రెండు తెలుగు సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యారు . ఇప్పటికే రవితేజ హీరోగా అమర్ అక్బర్ అంటోనీ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించారని తెలుస్తోంది . న్యాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్సకత్వంలో తెరకెక్కనున్న జెర్సీ సినిమాలో కూడా శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని సమాచారం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here