సుధీర్  బాబు , అదితి రావు హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా సమ్మోహనం . ఈ చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది . చాలా సంవత్సరాల తరువాత మెచ్యూర్డ్ ప్రేమ కావ్యాన్ని వెండితెరపై చూసామని సినిమా క్రిటిక్స్ కితాబిచ్చారు . ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీ పతాకం పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు . ఈ సినిమా ప్రేక్షాకాదరణతోనే కాక వసూళ్ళ పరంగా కూడా దూసుకుపోతోంది . ఈ విజయాన్ని పురస్కరించుకొని సూపర్ స్టార్ కృష్ణ ఇల్లు వేదికగా సంబరాలు చేసుకున్నారు . ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు కృష్ణ దంపతులు పసందైన విందు ఇచ్చారు  .

ఈ విషయాన్ని ఫోటో జతపరుస్తూ సీనియర్ నటుడు నరేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు . “సమ్మోహనం సక్సెస్ సెలబ్రేషన్స్ ఇంటి నుండే మొదలుపెట్టాం . ఇంతకంటే మంచి ప్రదేశం లేదని భావిస్తున్నాం . సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులు , క్రిటిక్స్ కు కృతజ్ఞతలు” అని పోస్ట్ చేసారు . అక్కడ జతపరచిన విందు ఫోటోలో సూపర్ స్టార్ కృష్ణ , విజయ నిర్మల , కృష్ణ అల్లుడు సమ్మోహనం సినిమా హీరో సుధీర్ బాబు , దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి , నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ , చిత్రం లో కీలక పాత్ర పోషించిన నరేష్ ఉన్నారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments