తనకు ప్రాణహాని ఉందని , వెంటనే తనకు తుపాకీ లైసెన్సు ఇప్పించాలని టీమిండియా ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి కోరినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి . తనకు 0.32 రివాల్వర్ ఇవ్వాలని ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నారు . తన భర్త ధోనీ అంతర్జాతీయ పర్యటనల దృష్ట్యా ఇంట్లో ఉండే సమయం తక్కువని , ఇంట్లో తాను తన కూతురు మాత్రమే ఉంటారని , వ్యక్తిగత పనుల నిమిత్తం తాను ఒంటరిగానే బయటకి వెళ్తుంటాను కాబట్టి తను వీలైనంత త్వరగా లైసెన్స్ కలిగిన పిస్టల్ లేదా రివాల్వర్ ఇప్పించాలని అప్లికేషను లో పేర్కొన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments