స్వామివారి పరువు రూ . 100 కొట్లేనా …

688

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో అర్చక స్థానానికి 65 ఏళ్ల వయోపరిమితి విధించి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో సహా మరో ముగ్గురిపై వేటు వేయడం , ఆ తరువాత రమణ దీక్షితులు ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం , దీనికి సమాధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరువు నష్టం కింద రమణ దీక్షితులు రూ .100 కోట్లు చెల్లించాలని ఆలయ అధికారులు నోటీసులు పంపడం ఇవ్వన్నీ తెలిసినవే .

అయితే తాజాగా తనపై పరువు నష్టం కింద రూ .100 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు పంపిన విషయం పై రమణ దీక్షితులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . ఈరోజు  ఆయన హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో  మాట్లాడుతూ తాను శ్రీ వెంకటేశ్వరస్వామివారి పరువు తీశానని ఆరోపిస్తూ రూ . 100 కోట్లను చెల్లించాలని టీటీడీ అధికారులు తనకు నోటీసులు పంపించారని , తన ఇష్టదైవమైన పూజించే కలియుగ దేవదేవుని పరువు విలువ రూ . 100 కోట్లని ఎలా లెక్కగడతారని ఆయన ప్రశ్నించారు . వెలకట్టలేని స్వామికి వెలకట్టిన ఘనత ఈ అధికారులకే దక్కిందని మండిపడ్డారు .

ఇంకా మాట్లాడుతూ తాను చేసిన ఆరోపణలపై నిష్పక్షపాతమైన విచారణ జరపాల్సిందిపోయి ,తనకు నోటీసులు ఏంటని అన్నారు . స్వామివారికి వైఖానస ఆగమ శాస్త్ర పద్ధతుల్లో అన్ని కార్యక్రమాలూ జరుగుతున్నాయని భక్తులకు నమ్మకం కలిగించే చర్యలు ఎక్కడ తీసుకున్నారని అడిగారు. ఆరాధనలు, అభిషేకాలు, అలంకారాలు, నైవేద్యాలు సరిగ్గా జరుగుతున్నాయని నిరూపించుకోవాలని , స్వామి వారి ఆస్తులను , దివ్యమైన తిరువాభరణాలు భద్రమని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు . నిరూపించుకున్న తరువాత తన ఆరోపణలు కనుక అసత్యమైతే తనపై పరువు నష్టం దావా వేసుకోవచ్చని అన్నారు . తనపై టీటీడీ అధికారులు రూ . 100 కోట్ల పరువు నష్టం దావా వేయడం సరికాదని , అధికారులకు ఈ సలహా ఇచ్చిన వ్యక్తిని చాలా పెద్ద బృహస్పతి గా భావిస్తున్నాని ఎగ్దేవా చేశారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here