హిట్ లిస్టులో ప్రకాష్ రాజ్ …

717

కొన్ని నెలల క్రితం బెంగళూరులో ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ను దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులకి చిక్కిన కీలక నిందితులు తమ హిట్‌లిస్టులో ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా ఉన్నట్లు తెలిపినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో హిందూ వ్యతిరేకులుగా ఉన్న మొత్తం 60 మంది జాబితాను వారు సిద్ధం చేసిపెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.

గౌరీ లంకేశ్‌ హత్య కేసులో పోలీసులకు చిక్కిన షార్ప్‌షూటర్‌ పరశురామ్‌ వాగ్మారే సిట్‌ ముందు ఈ విషయాలు తెలిపినట్లు సమాచారం. హిందూ మతాన్ని కించపరిస్తే తాము ఊరుకోబోమని ఆయన అన్నాడు. ఈ జాబితా బయటకు రావడంతో వారందరికీ భద్రత కల్పించాలని సంబంధిత అధికారులకు సిట్‌ లేఖ రాసింది. దీంతో నిడుమామిడి మఠం శ్రీ వీరభద్ర చెన్నమల్లస్వామితో పాటు నటుడు గిరీష్‌ కర్నాడ్, సాహితీవేత్తలు కేఎస్‌ భగవాన్, నరేంద్రనాయక్ లకు భద్రత కల్పించాలని సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here