చక్రి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పంతం . ఈ సినిమా గోపీచంద్ కెరీర్లో తన 25 వ సినిమా కావడం విశేషం . ఈ సినిమాలో మేహరీన్ హీరోయిన్ గా నటిస్తున్నారు . ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఒక పాట విడుదలై మంచి ఆదరణ పొందింది . తాజాగా తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేతులమీదుగా రెండోవ పాటను విడుదల చేశారు .

“హేయ్ ఆరడుగులున్న అందగాడు .. నాకెందుకో చూడగానే నచ్చినాడు” అంటూ సాగే ఈ పాటను భాస్కర భట్ల రాయగా .. గోపీసుందర్ సంగీత దర్శకత్వంలో సితార కృష్ణకుమార్ ఆలపించారు. సంగీత సాహిత్యాలు యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. కొంతకాలంగా వరుస పరాజయాలతో వున్న గోపీచంద్ .. ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments