వరుస విజయాలతో ఉన్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున తో కలిసి ఒక మల్టీస్టారర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమాలో నాని డాక్టర్ గా నటిస్తున్నారు . ఆతరువాత నాని నటించనున్న సినిమా పేరు జెర్సీ అని దానికి సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను నాని తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు . అయితే ఇప్పుడు మల్టీస్టారర్ లో నూ , బిగ్ బాస్ షో తో బిజీగా ఉన్న నాని ఇవ్వన్నీ ముగించుకొని క్రికెటర్ క్యారెక్టర్ కోసం ప్రాక్టీస్ చేయనున్నారట . ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సెప్టెంబర్‌లో స్టార్ట్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారట దర్శకుడు . 1980–90ల మధ్యలో జరిగే ఈ స్టోరీలో నాని అర్జున్‌ పాత్రలో కనిపించనున్నారు . ఈ ఎమోషనల్‌ స్పోర్ట్స్‌ డ్రామాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు . ప్రస్తుతం సినిమా ప్రీ– ప్రొడక్షన్‌ వర్క్‌ స్టార్ట్‌ చేసే పనిలో పడ్డారట గౌతమ్‌ తిన్ననూరి

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments