తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రేపు విజయవాడకు వెళ్లనున్నారు . సతీమణి షైలిమ , కుమారుడు హిమాన్షు , కుమార్తె అలేఖ్య తో కలిసి బెజవాడకు వెళ్లనున్నారు . ఈ సందరభంగా కేటీఆర్ దంపతులు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకొనున్నారు . ఈ పర్యటన సందర్భంగా కేటీఆర్ కుటుంబం పున్నమి ఘాట్ లోని టూరిజం రిసార్ట్స్ లో బస చేయనుంది . కేటీఆర్ రాక సందర్భంగా రిసార్ట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments