జూనియర్ ఎన్టీఆర్ తాను తెలుగు సినిమా పరిశ్రమలో కధానాయకుడిగా అడుగుపెట్టినప్పటి నుండి అనేక వైవిధ్యభరితమైన కధలు ఎన్నుకుంటూ విజయపధంలో దూసుకుపోతున్నారు . అటు కధానాయకుడిగానే కాక బిగ్ బాస్ సీజన్ 01 కి వ్యాఖ్యాత వ్యవహరించి తాను ఆ రంగంలో కూడా రాణించగలనని నిరూపించుకున్నారు . బిగ్ బాస్ సీజన్ 02 కి కూడా ఆయనను వ్యాఖ్యాతగా వ్యవహరించమని సంప్రదించగా సినిమాలలో బిజీ గా ఉండడంతో వీలుపడలేదని ఆ షో నిర్వాహకులు తెలిపారు . ఈ రెండోవ సీజన్ కు నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నా , ఎన్టీఆర్ లాగా షోను తీసుకువెళ్ళలేకపోతున్నారన్న భావనలో ప్రేక్షకులు ఉన్నారు .

అయితే ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ బుల్లి తెరమీద అభిమానులను , ప్రేక్షకులను అలరించనున్నారు .  అది కూడా బాగా పేరొందిన ఒక డాన్స్ షో లో . వివరాలలోకి వెళితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులలో బాగా ఆదరణ పొందిన డాన్స్ షో ఢీ ఇప్పుడు పదోవ సీజన్ కు చేరుకుంది . ఈ పదోవ సీజన్ ఫైనల్ కు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ వచ్చారని సమాచారం . ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ షో ఫైనల్ ఎపిసోడ్ , వచ్చే నెల మొదటి వారం లో టీవీలో ప్రసారం కానుంది . మరి డాన్స్ అంటేనే గుర్తుకొచ్చే ఎన్టీఆర్ ఈ షో లో అతిధిగా వచ్చి ఎలా అలరించారో చూడాలంటే ఇంకొంత సమయం వేచి చూడక తప్పదు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments