తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్ళలోనే విజయాలను సాధించారు హీరో నితిన్ . ఇప్పుడు ఆయన ఛలో సినిమాతో విజయం సాధించిన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు . అయితే ఇప్పుడు ఈ సినిమాకు భీష్మ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది . “సింగల్ ఫరెవర్” అనేది ట్యాగ్ లైన్ . ట్యాగ్ లైన్ ను బట్టి చూస్తుంటే పెళ్లి మీద ఎటువంటి ఆసక్తి లేని హీరో ఏ విధంగా ప్రేమలో పడతాతాడు అనేది ఈ సినిమాలో ముఖ్య కధాంశంగా భావించవొచ్చు .

ఛలో సినిమాతో విభిన్నమైన లవ్ స్టోరీ ను ప్రేక్షకులకు పరిచయం చేసి మంచి విజయాన్ని అందుకున్నారు వెంకీ కుడుముల . ఇప్పుడు నితిన్ తో కూడా లవ్ స్టోరీ చేస్తుండడంతో చిత్రం ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి ప్రేక్షకులలో పెరిగోపోతోంది . మరి వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఈ చిత్రం తో మళ్ళీ విజయాల బాటల వస్తారో లేదో వేచి చూడాలి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments