ప్రతిపక్ష నేతగా జగన్ బాగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు . బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాదయాత్రతో వైసీపీ బాగా నిలదోక్కుకుందని , పాదయాత్రపై టీడీపీ లో చర్చలు జరుగుతున్నాయని అన్నారు . రాష్ట్ర విభజన కష్టమైతే పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రానికి వరమని అభిప్రాయపడ్డారు . ఒక జాతీయ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవలసిన అవసరం ఏమిటని ఆయన నిలదీశారు . పట్టిసీమ వల్లే ఇవాళ కృష్ణా డెల్టా బ్రతికిందని అన్నారు . ముంపు మండలాలను ఏపీలో కలపకపోయి ఉంటే పోలవరం ఈరోజు సాధ్యం అయ్యేది కాదని అన్నారు . ముంపు మండలాలను ఏపీలో కలపకపోతీ తాను ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనన్న చంద్రబాబు మాట నమ్మనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments