విభజన హామీలలో కడపకు స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని ఆనాటి కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చింది . అయితే ఇటీవలే తాము కడపకు ఉక్కు పరిశ్రమ ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది . ఈ మేరకు తెలుగుదేశం ఎంపీ సి .యం . రమేష్ ప్రధాని నరేంద్ర మోదీకి కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఒక లేఖ ద్వారా డిమాండ్ చేశారు . ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి మేకాన్ సంస్థ ఇచ్చిన సాధ్యాసాద్యాల నివేదికను పరిశీలించాలని కూడా ఆయన కోరారు . దాని తరువాత కడపలో ప్లాంటు ఏర్పాటు చేయకుంటే తాను ఆమరణ దీక్షకు దిగుతానన్న విషయం తెలిసినదే .

అన్న మాటను అనుసరించి సి.యం.రమేష్ కడప జిల్లాలో వెంటనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వేదికగా కడపలో ఆమరణ దీక్ష మొదలుపెట్టనున్నారు . ఆయన దీక్షకు “ఉక్కు దీక్ష”అని పేరు పెట్టారు . ఈ ఉక్కు దీక్ష సందర్భంగా సి.యం.రమేష్ మాట్లాడుతూ , వైకాపా ఎంపీల మాదిరిగా తాను దొంగ దీక్షలకు దిగడం లేదని , కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రకటన వచ్చే వరకు తాను ఆమరణ దీక్షకు కూర్చోనున్నానని తెలిపారు …

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments