ప్రేమికులు తమ ఇళ్ళల్లో ఒప్పుకోవపోవడంతో పారిపోయి సరిగ్గా పెళ్లి చేసుకునే సమయానికి అమ్మాయి తల్లితండ్రులు వచ్చి తీసుకువెళ్ళే సన్నివేశాలు మనం సినిమాలో చూస్తుంటాం . అయితే ఇప్పుడు అలాంటి సంఘటనే నిజామాబాద్ లో జరిగింది . మరో అయిదు నిమిషాలలో కోరుకున్న వ్యక్తి జీవితంలోకి వస్తున్నారన్న యువ జంట ఆసలు ఆవిరయ్యాయి . పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోకపోయేసరికి ఆ యువ జంట ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు . ఇంకాసేపట్లో పెళ్లి జరుగుతుంది అనగా అమ్మాయి తరపు బంధువులు పదుల సంఖ్యలో ఆర్య సమాజ్ కు బైకులపై వచ్చి పెళ్లిని నిలిపివేయాలంటూ ఆర్య సమాజ్ నిర్వాహకులను కోరారు . ఏదైనా సమస్య ఉంటే బయట తేల్చుకోవాలని ఆర్య సమాజ్ నిర్వాహకులు చెప్పడంతో అమ్మాయిని లాక్కెళ్ళబోయారు . ఈ క్రమంలో అబ్బాయి అడ్డుపడడంతో అతన్ని అందరూ కలిసి చితగోట్టారు . అనంతరం తమతో రావడానికి నిరాకరించిన అమ్మాయి చెంపలు వాయించి , ఆ పై భుజాన వేసుకొని ఇంటికి తీసుకెళ్ళారు . ఈ ఘటనతో అర్య సమాజ్ పరిసర ప్రాంతాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments