ఎల్బీనగర్ ప్రజల ఆరేళ్ల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. మరో నెలరోజుల్లో అమీర్‌పేట-ఎల్బీనగర్ మధ్య మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. మంగళవారం ఈ రెండు ప్రాంతాల మధ్య టెస్టు రన్ ప్రారంభమైంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 16 కిలోమీటర్ల దూరానికి ట్రయల్ రన్‌ ముగిసి అనుమతులు వచ్చిన వెంటనే ప్రయాణికులకు అందుబాటులో తీసుకురానున్నారు. అంటే.. ఆగస్టు నాటికి ఈ రెండు ప్రాంతాల ప్రయాణికుల కష్టాలు గట్టెక్కనున్నాయి. కాగా, నేడు మెట్రో రైలు ప్రాజెక్టు పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించనున్నారు. అలాగే, అమీర్‌పేట-ఎల్బీనగర్‌ మధ్య మొదలైన ట్రయల్‌ రన్‌ను పరిశీలిస్తారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments