చంద్రబాబు పై జగన్ ట్వీట్

699

కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం గూండాయిజం ప్రదర్శించారు. అయ్యా..! అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత, వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కాసేపటి క్రితం ట్విటర్‌లో స్పందించారు.

విస్తుపోయా!… ‘మనం నాగరికంగా ఉండాలంటే నాయీబ్రాహ్మణుల సేవలు పొందడం తప్పనిసరి. అలాంటి నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్నముఖ్యమంత్రి చంద్రబాబుగారు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను. తమ గోడు చెప్పుకోవడానికి వచ్చిన వారిని బెదిరించడం గర్హనీయం. పైగా తలనీలాలు తీసినందుకు రూ.25లు చొప్పున ఇస్తానంటూ, ఏదో దేవుడిచ్చిన వరం మాదిరిగా చంద్రబాబుగారి హావభావాలు ఆయనలోని అహంకార, నియంత స్వభావాలను కళ్లకుకట్టినట్లు చూపించాయి. చంద్రబాబుగారికి బీసీలపట్ల కపటప్రేమ మరోసారి వెల్లడైంది. ప్రతిరోజూ ఆలయంలో ఒక నాయీ బ్రాహ్మణుడు మహా అయితే 10-15 మందికి తలనీలాలు తీస్తారు. భక్తులు రద్దీగా ఉంటేనే అదికూడా సాధ్యం. భక్తులు రాకపోతే గుడిని నమ్ముకున్న తమ బతుకుల పరిస్థితి ఏంటని అడుగుతున్న నాయీ బ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్లపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన తీరు ఇదేనా? కనీస వేతనాలు ఇవ్వనంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పటం చట్టానికి వ్యతిరేకం’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here