పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ పార్టీ జనసేన ను నాలుగేళ్ల క్రితం నోవెటల్ వేదికగా ప్రకటించారు . ఆ తరువాత ఆయన 2014 ఎన్నికలలో టీడీపీ . బీజేపీ కూటమికి మద్దతు పలికి రాష్ట్రమంతా తిరిగి ప్రచారం నిర్వహించడం , దానితో టీడీపీ విజయం సాధించడం జరిగాయి . కానీ అనంతరం అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో ప్రత్యేక హోదా గురుంచి సభలు ఏర్పాటు చేసి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు . అయితే అనంతపురం లో సభ నిర్వహించిన సందర్భంలో తాను అనంతపురం నుండే ఎమ్మెల్యే గా బరిలో దిగుతానని ప్రకటించిన విషయం తెలిసినదే . అయితే దాని తరువాత ఎటువంటి జనసేన పార్టీ నుండి పవన్ పోటీ గురుంచి ఎటువంటి ప్రకటన చేయలేదు .

అయితే ఇప్పుడు పవన్ పోటీ గురుంచి ఒక ఆసక్తికర వార్త తెలుస్తోంది . అదేంటంటే పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో దిగాలని అనుకుంటున్నారని సమాచారం . ఒకవేళ అదే కనుక జరిగితే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కు గట్టి పోటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి . ఇక్కడ సినిమా గ్లామర్ ప్రభావం ఒకటే కాకుండా ఇప్పుడు జనసేన పోరాట యాత్ర లో పవన్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధనలో పోషించిన పాత్ర గురుంచి , టీడీపీ నేతలు తనపై చేసిన దాడుల గురుంచి బహిరంగంగా తెలపడం వంటివి బాలకృష్ణ పై ప్రభావం చూపే అవకాశం ఉంది . అయితే పవన్ పోటీ గురుంచి తెలిసి పవన్ తాను అనంతపురం నుండి పోటీచేస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని అనుకుంటున్నారు . అయితే దీనికి సంబంధించిన ప్రకటన జనసేన పార్టీ నుండి ఇంకా వెలువడలేదు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments