టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఒక చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసినదే . ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో కొనసాగుతోంది . కానీ ఈ షూటింగ్ సమయంలో ఓ అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది . ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన త్రివేంద్ర సింగ్ రావత్ , మహేష్ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి మర్యాదపూర్వకంగా మహేష్ ను కలిశారు . అందుకు సంబందించిన ఒక ఫోటో బయటకు వచ్చింది . ఇందులో మహేష్ బాబు టోపీ పెట్టుకొని కొత్త లుక్ తో సీఎం పట్ల మర్యాద చూపిస్తున్నారు . ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments