రాజముండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈరోజు మీడియా సమావేశం లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై నిప్పులు చెరిగారు . ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా , ప్యాకేజీ విషయంలో చంద్రబాబు ఎదో ఒక మాటపై స్థిరంగా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు . ఏపీకి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఏది కావాలో తేల్చుకోలేని స్థితిలో చంద్రబాబు ఉండిపోయారని , అందుకే పలుసార్లు ఈ విషయం పై మాట మార్చారని విమర్శించారు .

చంద్రబాబు కేంద్రం పై తిరగబడాలని తాను ఎప్పుడో చెప్పానని కానీ ఆ పని చేయకుండా చంద్రబాబు నటిస్తున్నారని విమర్శించారు . ఈ సందర్భంగా ఆయన జనసేన పార్టీ నివేదిక గురుంచి మాట్లాడారు . ఆయన మాట్లాడుతూ కేంద్రం నిధులు ఇచ్చామని , రాష్ట్రం ఇవ్వలేదన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ కమిటీ వేశారని , అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఎంత రావాలని తేల్చారని , అయితే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఇంతవరకూ స్పందించలేదని ఉండవల్లి తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments