ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోడలనో, హీరో బాలకృష్ణ కుమార్తె అనో, మంత్రి లోకేష్ భార్య అనో కాకుండా తనకంటూ గుర్తింపును తెచ్చుకున్న మహిళా పారిశ్రామికవేత్త నారా బ్రహ్మణి, ఫాదర్స్ డే సందర్భంగా తండ్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తను వ్యాపారం పనులతో తీరిక లేకుండా గడుపుతున్నానని, లోకేష్ కూడా బిజీగానే ఉన్నారని, తీరిక దొరికితే మాత్రం అందరమూ కలసి ఆ రోజును పండగలా జరుపుకుంటామని చెప్పారు. తన తండ్రి పుట్టిన రోజున తాను హైదరాబాద్ లో లేనని, అందుకే ఒకరోజు ముందే తను, దేవాన్ష్ కలసి నాన్న ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించామని తెలిపారు.

ప్రజలకు సేవ చేయాలన్నదే నాన్న లక్ష్యమని, మంచి సినిమాలు చేయాలన్నది కూడా ఆయన టార్గెట్ లలో ఒకటని వెల్లడించిన బ్రహ్మణి, ఆయన సింపుల్ గా వుంటారు, తమకూ అదే నేర్పారని అన్నారు. నటుడిగా, ప్రజా నాయకుడిగా ఆయన సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. హిందూపురంలో జరిగిన అభివృద్ధి గురించి జనం గొప్పగా చెబుతుంటే ఎంతో పొంగిపోతుంటానని చెప్పుకొచ్చారు. త్వరలో అమరావతిలో ఓ కేన్సర్ హాస్పిటల్ ను ఆయన ప్రారంభించనున్నారని అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments