నకిలీ అడ్రస్ తో కారు రిజిస్ట్రేషన్ , పన్ను ఎగవేత కేసులో హీరోయిన్ అమలాపాల్ పై కేరళ ప్రభుత్వం ఛార్జ్ షీట్ నమోదు చేయబోతోంది . గతంలో ఈ వ్యవహారంలో కోర్టుకు లొంగిపోయిన అమలాపాల్ , వెంటనే బెయిల్ పై బయటకి వచ్చారు . ప్రముఖ పత్రిక కధనం ప్రకారం ఫేక్ అడ్రస్ తో కోటి రూపాయల విలువ చేసే కారును పుదుచ్చేరిలో అమలాపాల్ రిజిస్ట్రేషన్ చేయించారు . దీంతో ఆమె కేరళ ప్రభుత్వానికి దాదాపు రూ . 20 లక్షల పన్ను ఎగ్గొట్టినట్టయింది . ఈ వ్యవహారం కేరళ ప్రభుత్వం దృష్ఠ్టిలో పడడంతో వెంటనే ఆ రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ను రంగంలోకి దింపింది .

అయితే కేసు కోర్టులో విచారణ కొనసాగుతుండగానే.. ప్రభుత్వం వారికి పన్నులు చెల్లించేందుకు మరో అవకాశం కల్పించింది. వారిలో ఫహద్‌ పన్ను చెల్లించటంతో అతనిపై కేసును ఉపసంహరించుకున్నారు. కానీ, అమలా, సురేష్‌ గోపీ మాత్రం పన్ను చెల్లించేందుకు నిరాకరించటంతో ఈ కేసులో కఠినంగా వ్యవహారించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఛార్జ్‌షీట్‌ నమోదు చేయాలని క్రైమ్‌ బ్రాంచ్‌కు సూచించిందంట. అయితే సురేష్‌ గోపి రాజ్యసభ సభ్యుడు కావటంతో ఈ వ్యవహారంలో న్యాయ నిపుణులు సలహా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారని ఆ కథనం ఉటంకించింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments