కొన్ని రోజులుగా రానున్న ఎన్నికలలో బీజేపీ , వైసీపీ పార్టీల పొత్తు ఉండనుందని తారా స్థాయిలో ప్రచారం జరుగుతోంది . అయితే ఇప్పుడు ఈ విషయం పై మాజీ కేంద్రమంత్రి , బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందరేశ్వరి స్పందించారు . సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవిడ మాట్లాడుతూ జగన్ , పవన్ తో కలిసి బీజేపీ పనిచేస్తుందన్న వార్తలు అవాస్తవమని అన్నారు . రానున్న ఎన్నికలలో ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని , వైసీపీ తో పొత్తు వార్తలను ఆమె ఖండించారు .
జగన్ తో పొత్తుపై పురందరేశ్వరి కామెంట్ …
Subscribe
Login
0 Comments