‘ఎన్టీఆర్’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

0
214

మహానటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. వచ్చే ఏడాది జనవరి 9న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని తెలిపింది. 1983లో అదే రోజున ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో, అదే రోజున సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. సంక్రాంతి బరిలో మంచి రికార్డ్ ఉన్న బాలయ్య… ఈ సినిమాతో మరో హిట్ కొడతారని అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా… క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here