ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జగదల్ పూర్ లో ఇద్దరు యువ జర్నలిస్టులు ఆత్మహత్యకు పాల్పడ్డారు . వివరాలలోకి వెళితే పత్రిక పేరుతో నడుస్తున్న దినపత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్న రేణు అవస్థి (21) అనే యువతి , ఐఎస్ఎస్ న్యూస్ ఛానెల్ లో రిపోర్టర్ గా పని చేస్తున్న శైలేంద్ర వి సుఖర్మ (34) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు . ఈ రెండు ఘటనలనూ వేర్వేరు కేసులుగా నమోదు చేసి పోలీసు దర్యాప్తు చేస్తున్నారు . వీరిద్దరి ఆత్మహత్యలకు ఏమైనా సంబంధం ఉందా ? అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments