తెలుగు పరిశ్రమలో ఉన్న అతి తక్కువ మహిళా పాటల రచయితలలో శ్రేష్ఠ ఒకరు . అర్జున్ రెడ్డి , పెళ్లి చూపులు తదితర చిత్రాలలో పాటలు రాసి అందరి మన్ననలను పొందారు . అయితే తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సంచలన విషయాలు వెల్లడించారు . ఆమె మాట్లాడుతూ తాను కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని , చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయని , అందువల్లనే తాను చిత్ర రంగంలోకి రావడాన్ని చాలా సార్లు వాయిదా వేసుకున్నానని తెలిపారు .

ఇంకా మాట్లాడుతూ సినీ రంగంలో పురుషులతో పాటు మహిళలు కూడా కాస్టింగ్ కౌచ్ కు పాల్పడుతున్నారని శ్రేష్ఠ అన్నారు . ఓ నిర్మాత భార్య తనను ఆమె భర్త వద్దకు వెళ్లాలని డిమాండ్ చేసిందని అన్నారు . ఇంకొక ఉదాహరణగా ఒక వ్యక్తి తనపై మనసు పారేసుకున్నాడని , గోవాలో ఓ పార్టీ ఇస్తున్నాడని ,అక్కడికి వెళ్లాలని ఓ మహిళా దర్శకురాలు చెప్పిందన్నారు శ్రేష్ఠ . ఆ పార్టీ తాను వెళ్లకపోయేసరికి ఆ వ్యక్తి తనకు ఫోన్ చేసి చెడా మాడా తిట్టాడని తెలిపారు . దీంతో కొన్ని నెలల పాటు ఇండస్ట్రీ కి దూరమయ్యానని శ్రేష్ఠ తెలిపారు

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments