టాలీవుడ్ లో ఇటీవల కాస్టింగ్ కౌచ్ అంశంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు నటి శ్రీరెడ్డి . టీవీ డిబేట్స్ లోనే కాక సోషల్ మీడియా లో తన ట్వీట్లు , పోస్టులతో పలువురిపై శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు . ప్రస్తుతం హీరో నాని పై చేస్తున్న ఆరోపణలు సోషల్ మీడియా లో దుమారం రేపుతున్నాయి . తనపై శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలపై నాని తన లాయర్ల ద్వారా లీగల్ నోటీసులు పంపడం , దానికి బదులుగా శ్రీరెడ్డి తాను కూడా చట్టపరంగా వెళతానని అన్నడం తెలిసిందే . ఈ నేపథ్యంలో నాని భార్య అంజనా తన ట్విట్టర్ ఖాతా ద్వారా శ్రీరెడ్డి పై మండిపడ్డారు .

నాని భార్య చేసిన ట్వీట్ కు శ్రీరెడ్డి స్పందిస్తూ “హాయ్ మిస్సెస్ . నేనిప్పుడే నువ్వు చేసిన పోస్ట్ ను చూశాను . నేను నీ భర్తతో ఉన్నప్పుడు నువ్వు చూడలేదు . నేను పేరు కోసం తాపత్రయపడడం లేదు . నీ భర్తే పేరు కోసం తాపత్రయ పడతాడు . నాకు ఉన్న పేరు చాలు , ఒకవేళ నా భర్తకే పేరు , డబ్బు ఉండి ఇలాంటి పనులు చేస్తే , నేను మాత్రం నా భర్తకు సపోర్ట్ చేయను . అవసరమైతే ఇలాంటి వాడ్ని వదిలేసి వెళ్ళిపోతానేమో అంతే కానీ బాధిత మహిళను మాత్రం అవమాన పరచను . ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను . మొత్తం విషయం తెలిసేవరకు సైలెంట్ గా ఉండండి . నా వైపు సత్యం ఉంది . కర్మ ఉంది . నీ భర్త తప్పకుండా శిక్షను అనుభవించాల్సిందే ” అని తన ఫేస్బుక్ ఖాతాలో అని పోస్ట్ చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments