వైసీపీ ఎమ్మెల్యేలకు సమాధానంగా లోకేష్ ట్వీట్ …

0
364

తమ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదంటూ టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా ఘాటు సమాధానమిచ్చారు. అంతేకాదు, వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు సంబంధించి, పనుల వివరాలతో కూడిన ఫ్యాక్ట్ షీట్ ను కూడా అప్ లోడ్ చేశారు.

“ఏదో చేస్తారనే నమ్మకంతో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు ఓటు వేశారు. కానీ, నియోజకవర్గానికి వారు చేసింది ఏమిటి? ఏమీ చేయలేదు. కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదు. అభివృద్ధి పనులు కావాలని కూడా అడగటం లేదు. కానీ జీతభత్యాలు, ఇతర సౌకర్యాలను మాత్రం పొందుతున్నారు. మాకు మాత్రం రాష్ట్రాభివృద్ధి మాత్రమే ఏకైక అజెండా. వైసీపీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలను పట్టించుకోకపోయినా, మేము పట్టించుకుంటున్నాం. ప్రజలు సమస్యలను ఎదుర్కోవడాన్ని మేము కోరుకోం. ప్రజలు అడక్కుండానే మేము అన్ని పనులను చేస్తున్నాం. నా శాఖ ద్వారా చేసిన పనులను ఇక్కడ ఇస్తున్నా. వాటిని చూసి, రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో మీరే నిర్ణయించుకోండి” అంటూ ట్వీట్ చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తన శాఖ ద్వారా చేపట్టిన పనుల ఫ్యాక్ట్ షీట్ ను లోకేష్ విడుదల చేశారు. ఆ వివరాలు ఇవే…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here