ఆదివారం కడపలో విలేఖరుల సమావేశంలో ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు . ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధికి వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే చంద్రబాబు నాయుడే ఎక్కువ నిధులు కేటాయించారని , సీమ అభివృద్ధి విషయంలో వైఎస్ కంటే చంద్రబాబే నయం అని పేర్కొన్నారు . కడప స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ అడ్డంకి ఆనందం సరికాదని , దీనిపై బీజేపీ నేత విషువర్ధన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు . స్టీల్ ప్లాంట్ సాధన కోసం సీఎం రమేష్ ఈ నెల 20 నుంచి ఆమరణదీక్ష ప్రారంభిస్తారని ఆదినారాయణరెడ్డి తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments