తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు తన స్టార్ డం ను విస్తరించుకుంటూ ఇతర భాషలలోనూ మార్కెట్ సంపాదించుకోవాలనే ఆలోచనలో ఎప్పటినుంచో ఉన్నారు . ఆ ప్రయత్నం గానే ఆయన స్పైడర్ సినిమాను తమిళ్ లో చేశారు , కాకపోతే అది కాస్తా దారుణ పరాజయాన్ని మిగిల్చింది . బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ కోసం ఆయన ఎప్పటినుంచో అనుకుంటున్నారు . భరత్ అనే నేను సినిమా విజయం తరువాత ఫారిన్ ట్రిప్ కు వెళ్లిన మహేష్ తిరిగి వచ్చేటప్పుడు ముంబై కి వెళ్లి అక్కడ బాలీవుడ్ సినిమా కోసం చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి , అయితే ఆయన అక్కడ ఆగింది బాలీవుడ్ సినిమా కోసం కాదని స్టైలింగ్ కోసమని తరువాత తెలిసింది .

అయితే తాజాగా మహేష్ తన బాలీవుడ్ ఎంట్రీ గురుంచి స్పందించారు . ఆయన స్పందిస్తూ “ఇప్పటికిప్పుడు హిందీ సినిమాలలో నటించాలని నేను అనుకోవడం లేదు . అలాగని హిందీ సినిమా చేయకూడదని కాదు . మంచి అవకాశం వస్తే ఆలోచిస్తా . బాలీవుడ్ సినిమా గురుంచి నేను ఆరాటపాడడం లేదు . ప్రస్తుతం నేను ఎలా ఉన్నానో … ఎక్కడ ఉన్నానో … అలా నేను హ్యాపీగానే ఉన్నాను ” అని అన్నారు . మహేష్ తన తదుపరి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసినదే .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments