నీటి ఆయోగ్ సమావేశంలో కేసీఆర్ ప్రసంగం …

0
244

ఈరోజు ఢిల్లీలో నీటి ఆయోగ్ సమావేశం జరిగింది . ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు , అభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు . ఇదే సమయంలో దేశాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలను వివరించారు . ఆయన సమావేశంలో ఈ విధంగా చెప్పుకొచ్చారు .

పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తయితే అదనంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతోంది.

కీలక ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేసేందుకు ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నాం .

వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతను ఇస్తున్నాం. రూ. 1,050 కోట్ల వ్యయంతో గత మూడేళ్లలో 18.30 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 356 గోడౌన్లను నిర్మించాం .

అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఎక్కువ నిధులను ఇవ్వలేని పరిస్థితుల్లో… పన్ను రాయితీలనైనా కల్పించాలి.

రాష్ట్రాల అభివృద్ధి పైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంది .

వ్యవసాయానికి అనుంబంధ రంగాలైన పౌల్ట్రీ, మేకలు, గొర్రెలు, చేపల పెంపకం, డెయిరీ రంగాలపై దృష్టి సారించాలి. ఆదాయపు పన్ను నుంచి మినహాయింపును ఇవ్వాలి .

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించాలి
.
వైద్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నగరీకరణ అంశాల్లో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛను ఇవ్వాలి.

విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, రక్షణ, అంతర్జాతీయ అంశాలపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టిని సారించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here