సస్సెక్స్ ప్రాంతంలో ఒక మహిళ కారులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి . అయితే ఆమె ఎటువంటి కంగారును లోనవకుండా ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకూడదని దగ్గరలోని గ్యాస్ స్టేషన్ లోని సేఫ్టీ వాల్ కు ఢీ కొట్టించి కారును ఆప్ ప్రయత్నం చేసింది . దాంతో కారు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది . అంత ప్రమాదం జరిగినా అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో ఆ మహిళ బయటపడింది .

పోలీసులు ఆ మహిళ చెప్పిన కారణం ప్రకారం కారును పరిశీలించి సస్సెక్స్ పోలీసులు బ్రేకులు ఫెయిల్ అవ్వలేదని , బ్రేకులు పడకపోవడానికి ఒక ఆసక్తికర కారణాన్ని వెల్లడించారు . కారు బ్రేక్ పెడల్ కింద వాటర్ బాటిల్ ఉండడంతో ఆమె ఎంత ప్రయత్నించినా బ్రేకులు పడలేదని , అయినప్పట్టికీ సమయస్ఫూర్తితో వ్యవరహించి ఘోర ప్రమాదం నుండి తప్పించుకున్నారని తెలిపారు . అలాగే స్థానిక డ్రైవర్లకు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవలసినదిగా పోలీసులు సూచించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments