ప్రస్తుతం తెలుగు , తమిళ్ , మళయాళ బాషలలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటి అనుపమ పరమేశ్వరన్ . శనివారం విజయవాడలో తేజ్ ఐ లవ్ యు చిత్రం ఆడియో సక్సెస్ మీట్ జరిగింది . ఈ సక్సెస్ మీట్ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ ప్రముఖ టీవీ ఛానెల్ తో మాట్లాడారు . ఆమె మాట్లాడుతూ “నా అభిమాన హీరో చిరంజీవి , ఆయన గొప్ప నటుడు ఛాన్స్ వస్తే చిరంజీవిగారితో ఆరనిమిషమైనా నటిస్తే నా జన్మధన్యమైనట్లే ” అని అన్నారు . ఇంకా మాట్లాడుతూ తేజ్ ఐ లవ్ యూ మంచి లవ్ స్టోరీ అని , ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ బాగుంటుందని అన్నారు .

ఇంకా మాట్లాడుతూ నేను నటించిన “అ … ఆ ” చిత్ర విజయోత్సవం గుంటూరులో జరిగింది . అప్పుడే విజయవాడ గురుంచి ,ఇక్కడ ఉన్న కనకదుర్గమ్మ ఆలయం దర్శించి తెలుసుకున్నాను . ఈ రోజు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉంది . నా అభిమాన నటి నిత్యామీనన్‌. సావిత్రిగారు గొప్ప నటి. ఆమె గురించి ఇటీవలే ‘మహానటి’ సినిమా చూసి తెలుసుకున్నాను . ప్రస్తుతం ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు బాగానే ఉన్నాయి . నా వరకూ బాగానే ఉంది. మంచి అవకాశాలు వస్తున్నాయి. రామ్‌ సరసన ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రంలో నటిస్తున్నాను . నటిగా మంచి గుర్తింపు పొందాలనేది నా ఆకాంక్ష. ముందు తెలుగు మాట్లాడటం రాక ఇబ్బందిగా ఉండేది . ప్రస్తుతం తెలుగు స్పష్టంగా మాట్లాడగలగడం హ్యాపీగా ఉంది’’ అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments