వివో నుండి మరో ఇన్నోవేటివ్ స్మార్ట్ ఫోన్ …

0
312

చైనీస్‌  స్మార్ట్‌ఫోన్ బ్రాండ్వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.  ‘వివో నెక్స్’ పేరుతో ఈ డివైస్‌ను  విడుదల చేసింది. ఫుల్‌-స్క్రీన్ డిస్‌ప్లేతో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది.  ముఖ్యంగా ఆ స్మార్ట్‌ఫోన్‌లో పాప్‌ అప్‌ సెల్ఫీ కెమెరా ప్రధాన ఫీచర్‌గా నిలవనుంది.  అత్యధిక స్టోరేజ్‌ కెపాసిటీతో ప్రీమియర్  వెర్షన్‌గా వివో నెక్స్‌ ఎస్‌, వివో నెక్స్‌ ఏ పేరుతో మరో స్టాండర్డ్‌ వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.  జోవి ఇంటెలిజెంట్‌ వాయిస్ అసిస్టెంట్,  మరింత అభివృద్ధిపరచిన  ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో ఈ ఇన్నోవేటివ్‌ వివో స్మార్ట్‌ఫోన్‌   నెక్స్‌ నయా ట్రెండ్‌ను సృష్టించనుందని  టెక్‌ పండితులు  భావిస్తున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు బ్లాక్‌, రెడ్‌  కలర్స్‌లో లభ్యం. చైనాలో వీటి ధర మన కరెన్సీ ప్రకారం సుమారు  53వేల రూపాయలు( ప్రీమియం వెర్షన్)గా ఉంది.  త్వరలోనే  భారత మార్కెట్లో కూడా వీటిని లాంచ్‌ చేయనుందని అంచనా.

ఫీచర్లు :

6.59 అంగుళాల సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 845 ఎస్‌ఓసీ  ప్రాసెసర్
8జీబీ ర్యామ్‌
256జీబీ స్టోరేజ్‌
12+5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
4000ఎంఏహెచ్‌  బ్యాటరీ, ఫాస్ట్‌చార్జ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here