తిరుమలలో గల వెయ్యి కాళ్ళ మండపాన్ని తిరిగి నిర్మించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు . మండప నిర్మాణం కోసం తాను కోర్టును ఆశ్రయిస్తానని తెలియజేశారు . నగిరి నియోజికవర్గంలోని టీటీడీ ఆలయ సమస్యలు పరిష్కరించాలని గత నాలుగేళ్ళుగా అనేక ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపినిచారు . ఈ సందర్భంగా ఆలయాల సమస్యలు పరిష్కరించాలంటూ టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కు వినతిపత్రం అందజేశారు .

రోజా మాట్లాడుతూ చంద్రబాబు గత నాలుగేళ్ళుగా రాష్ట్రానికి సంబందించిన ఏ విషయం కూడా పట్టించుకోకుండా ఇప్పుడు నవ నిర్మాణ దీక్ష పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు . కడప స్టీల్ ప్లాంట్ గురుంచి సీఎం రమేష్ దీక్ష చేస్తాననడం సిగ్గు చేటని , గత నాలుగేళ్ళుగా బీజేపీ తో అంటకాగిన టీడీపీ ఇప్పుడు ఉక్కు పరిశ్రమ గురుంచి మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments