రోజు దేశం లో ఎదో ఒక చోట పిల్లలపైనా , మహిళల పైనా పాశవిక దాడులు జరగడం చూస్తున్నాం . తాజాగా ఒక భయంకరమైన ఘటన హైదరాబాదు చైతన్యపురిలో చోటు చేసుకుంది . సొంత మేనమామే ఇద్దరు చిన్నారులను హతమార్చిన ఘటన ఇది . వివరాలలోకి వెళితే మిర్యలగూడాకు చెందిన లక్ష్మీ , శ్రీనివాసరెడ్డి దంపతులకు 12 ఏళ్ల వయసున్న సృజనరెడ్డి , విష్ణువర్ధన్ రెడ్డి  అనే కవలలున్నారు . చిన్నారులిద్దరూ మానసిక వికలాంగులు కావడంతో ఎలాగైనా వదిలించుకోవాలని వారి మేనమామ మల్లికార్జున రెడ్డి ప్లాన్ వేశాడు . పధకం ప్రకారం చిన్నారులకు మాయమాటలు చెప్పి హైదరాబాదు తీసుకొచ్చి హత్య చేశాడు . వారి మృతదేహాలను కారులో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా ఇంటి యజమాని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది . పోలీసులు మల్లికార్జున రెడ్డి తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు . ఈ హత్యల వెనుక ఇంకా ఎవరిదైనా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments