పెద్ద పెద్ద నగరాలలో ట్రాఫిక్ సమస్య గురుంచి చెప్పనవసరం లేదు . ఈ ట్రాఫిక్ సమస్య వలన చిన్న చిన్న దూరాలకు కూడా చాలా సమయం పడుతుంది , కొన్ని పనులకు సమయానికి చేరుకోలేం కూడా . ఇలాంటి ట్రాఫిక్ సమస్యతో విసిగిపోయిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విన్నోత్న రీతిలో గుర్రమెక్కి ఆఫీస్ కు వెళ్లి అందరిని ఆశ్చర్య పరిచిన సంఘటన బెంగళూరు లో చోటుచేసుకుంది . టిప్ టాప్ గా తయారై, భుజాన బ్యాగ్ తగిలించుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రూపేశ్ కుమార్ వర్మ ఎంచక్కా గుర్రమెక్కి ఆఫీసు ముందు దిగాడు.

గుర్రం పై ఆఫీస్ రావడం తో పాటు ఆ గుర్రం మీద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చివరి రోజు అని బోర్డు కూడా ఉంది . ఈ విషయం పై రూపేశ్ మాట్లాడుతూ సిటీ ట్రాఫిక్ రోజు రోజుకి పెరిగిపోతోందని , దీనిపై నిరసన తెలిపేందుకు ఈ వినూత్న ఆలోచన చేశానని తెలిపాడు . గుర్రం పై ఉన్న బోర్డు గురుంచి ప్రస్తావించగా ఏ కంపెనీ లోనూ తాను ఇక ఉద్యోగం చేయనని , అందుకే బోర్డు ఉంచానని , త్వరలో తాను సొంత సంస్థను ప్రారంభించనున్నారని రూపేశ్ కుమార్ చెప్పాడు

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments