ప్రేమ కోసం వెతికా …

622

సినీ నటి రేణూ దేశాయ్ ఆ మధ్య తన రెండో వివాహం గురుంచి ప్రస్తావించడం దుమారం రేపాయి . పవన్ ఫాన్స్ నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఆమె అదే స్థాయిలో సమాధానమిచ్చారు . “జీవిత భాగస్వామి కోసం వెతికితే తప్పేంటి ? . పిల్లల్ని , నన్ను చూసుకోవడానికి ఓ తోడు అవసరం ” అని అన్నారు . మళ్ళీ చాలా కాలం తరువాత తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో చర్చనీయాంశమైంది . ఓ వ్యక్తి చెయ్యి పట్టుకున్న ఫోటోను రేణూ దేశాయి ఇన్స్ట్టాగ్రామ్ లో షేర్ చేశారు . ఫోటో ను షేర్ చేయడమే కాకుండా ఒక కవిత కూడా రాశారు . “నా ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికా . ఆ ప్రయాణంలో ప్రేమ అనేది ఓ అనుభూతి అన్న సంగతినే మర్చిపోయా . నీలో నా ప్రేమ దొరికింది” అంటూ ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని వర్ణించారు . “నీతో ఉంటే చాలా సంతోషంగా , శాంతంగా ఉంటాను . నా చెయ్యి పట్టుకో , ఎప్పటికీ విడవకు … అవును , ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు” అంటూ ఆమె భావనలను కవిత ద్వారా తెలియజేశారు . ఈ కవితతో ఆమెకు కావలసిన తోడు దొరికిందా ? అన్న చర్చ మొదలైంది . ఈ కోణంలోనే చాలా మంది ఆమెకు కామెంట్ చేశారు . కానీ రేణు దేశాయ్ నుండి ఏ విధమైన స్పందన రాలేదు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here