కొన్ని సంవత్సరాల క్రితం రామచరణ్ హీరోగా నటించిన నాయక్ సినిమాలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళి వికలాంగులను చేసి బిక్షాటన చేస్తూ డబ్బు సంపాయిస్తూ ఉండే సన్నివేశం ఉంది . సరిగ్గా అలాంటి సంఘటనే కర్ణాటక లోని కళబురిగిలో వెలుగు చూసింది . అభం శుభం తెలియని చిన్న పిల్లలని అపహరించి , వారి నాలుకలను కత్తిరించి భిక్షాటన చేయిస్తున్న ముగ్గురు మానవ అక్రమ రవాణాదారులను పోలీసులు అరెస్ట్ చేశారు .
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన చిన్నారులను కలబురిగికి తీసుకొచ్చి భిక్షాటన చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈనెల 8న అధికారులు పోలీసులు తనిఖీలు చేపట్టారు. భిక్షాటన చేస్తున్న ఐదు మంది చిన్నారులను గుర్తించి స్థానిక ఆస్పత్రికి తరలించగా చిన్నారుల నాలుకలను కత్తరించినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. పగలంతా భిక్షాటన చేయగా వచ్చిన సొమ్మును రవాణాదారులకు అందజేసినా కడుపునిండా అన్నం కూడా పెట్టడం లేదని విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు చిన్నారులను అపహరించి తీసుకొచ్చి భిక్షాటన చేయిస్తున్న రూబీ, రైయిసా బేగం, ఫరీదాలను కలబుర్గిలోని అరెస్ట్ చేశారు.