ఇండస్ట్రీ కి వచ్చిన కొంత కాలంలోనే మంచి సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో రాజ్ తరుణ్ . కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు లవర్ గా మళ్ళీ వస్తున్నారు . అనీష్ కృష్ణ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు . ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కు జోడీగా రిద్ధి కుమార్ నటిస్తున్నారు . ఈ చిత్రంలోని ఐదు పాటలకు ఐదుగురు మ్యూజిక్ డిరెక్టర్లు సంగీతం అందించడం విశేషం . తాగా ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేశారు . ఈ పోస్టర్ లో చూస్తే హీరో కొండ చివరో కూర్చొని ఏదో ఆలోచనలో ఉనట్టుగా తెలుస్తోంది . ఆ వీడియో కు సాయి కార్తీక్ అందించిన మ్యూజిక్ బిట్ జోడించడంతో మోషన్ పోస్టర్ ఇంకా ఇంటరెస్టింగ్ గా ఉంది . పోస్టర్ లో చూపించిన విజువల్ చూస్తుంటే చిత్రంలోని కీలక సన్నివేశానికి సంబంధించినట్టుగా తెలుస్తోంది . త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments