మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు, అదితిరావు హైదరి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సమ్మోహనం’. తాజాగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. సినిమా చాలా బాగుంది అంటూ సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో చిత్ర టీమ్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలోనే  సమ్మోహనం టీమ్‌కి సూపర్ స్టార్ మహేష్ బాబు షాక్ ఇచ్చారు.
సినిమాపై తన స్పందనను తెలియజేస్తూ తాజాగా మహేష్ ట్వీట్ చేశారు. ‘‘మోహన్‌కృష్ణ ఇంద్రగంటి సమ్మోహనం చిత్రాన్ని ఎంతో అందంగా, బ్రిలియంట్‌గా తెరకెక్కించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న గొప్ప దర్శకులలో మోహన్‌కృష్ణ ఇంద్రగంటి ఒకరు. సమ్మోహనం నాకు చాలా బాగా నచ్చింది. సుధీర్‌బాబు, అదితిరావు హైదరీ అద్భుతమైన నటనను కనబరిచారు. వారి కెరీర్‌లో ఇదే బెస్ట్. ఈ సందర్భంగా నటుడు నరేష్‌గారి నటనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన నటన ఈ సినిమాలో అద్భుతం. చిత్రయూనిట్ మొత్తానికి నా అభినందనలు..’’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు.ఊహించని ఈ పరిణామానికి చిత్ర యూనిట్ షాక్ అవ్వడమే కాకుండా సంతోషంతో మహేష్‌కు ధన్యవాదాలు తెలుపుతూ రిప్లైలు ఇస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments