సాయి ధరమ్ తేజ్ కధానాయకుడిగా కరుణాకరణ్ దర్సకత్వంలో రూపొందిన సినిమా తేజ్ ఐ లవ్ యు . ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఆడియో సక్సెస్ మీట్ హైదరాబాదు లో జరిగింది . ఈ సందర్భంగా నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ “ఈ సినిమా కరుణాకరణ్ బ్రాండ్ కు తగినట్టు ఉంది . అందమైన లవర్ స్టోరీ తీశాం . అందమైన ప్రేమకవితలా ఈ సినిమా ఉంటుంది  . ఈ సినిమా కచ్చితంగా విజయవంతం అవుతుంది ” అని ధీమా వ్యక్తం చేశారు .

దర్శకుడు కరుణాకరణ్ మాట్లాడుతూ “క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో నాకిది రెండో సినిమా . ఈ సినిమా చాలా బాగా వచ్చింది . పరీక్ష రాసిన స్టూడెంట్ లా ఈ సినిమా రెజల్ట్ కోసం ఎదురుచూస్తున్నా” అని అన్నారు . సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ “ఈ సినిమాకు మంచి సంగీతాన్ని అందించారు . ఆడియో బాగా సక్సెస్ అయ్యింది ” అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు . జూలై 6 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments