వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాష్ట్రంలోని రాక్షస సైన్యానికి శుక్రాచార్యుడులిగా తయారయ్యారని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు . ఢిల్లీలో జరిగిన సమావేశం వైసీపీ , బీజేపీ కుట్ర రాజకీయాలకు నిదర్శనమని , ఏపీ భవన్ సాక్షిగా చంద్రబాబు పై కుట్ర పన్నుతున్నారని అన్నారు . కర్ణాటక ఎన్నికలలో వైసీపీ బీజేపీ కి మద్దతుగా ప్రచారం చేసిన విషయం వాస్తవం కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు . ఈ రెండు పార్టీల కుట్రను దేశవ్యాప్తంగా ప్రచారం చేసి వారి బండారం బయటపెడతామని మాణిక్య వరప్రసాద్ తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments