విశాఖ లో చిరుత సంచారం కలకలం రేపుతోంది . ఓ కేసు నిమిత్తం పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తుండగా చిరుత కనిపించింది . రిషికొండ సన్నీ హైట్స్ పరిసర ప్రాంతాల్లో చిరుత ఉన్నట్టు పోలీసులు గుర్తించారు . సీసీ కెమెరా ఫూటేజ్ లో చిరుతను చూసి షాకైన పోలీసులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు . ఇంతకముందు కూడా ఆ ప్రాంతంలో చిరుతలు సంచరించాయని , కుక్కలను వేటాడదానికి రాత్రి సమయంలో జనావాసాల్లోకి చిరుతలు సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు . తమ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నాయని తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు . అధికారులు చిరుతను బంధించి జూకు తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments