ఈరోజు రంజాన్ పర్వదినం సందర్భంగా విజయవాడ మున్సిపల్ స్టేడియం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు . రంజాన్ పండుగ సందర్భంగా సీఎం ముస్లింలకు ఊర్డూ భాషలో శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రానికి మేలు చేయమని అల్లాను వేడుకున్నానని తెలిపారు . ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని , దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇమామ్ లకు , మౌజమ్ లకు వరుసగా ఐదు వేలు , మూడు వేల రూపాయల పారితోషకం ఇస్తున్నామని చెప్పారు . దేశంలోని మిగతా రాష్త్రాలలో ఎక్కడా కూడా ఈ విధంగా ఇవ్వడం లేదని అన్నారు .  పండుగ సందర్భంగా పన్నెండు లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చామని చంద్రబాబు తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments