ప్రపంచంలోని అద్బుతమైన కట్టడాలాలో ఈఫిల్ టవర్ ఒకటి . ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఈఫిల్ టవర్ వద్దకు వస్తారు . అయితే ఇప్పుడు ఈ ఈఫిల్ టవర్ చుట్టూ కొత్త ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశారు . టవర్ సమీపంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సుమారు 40 మిలియన్ల డాలర్ల వ్యయంతో కట్టుదిట్టమైన ఫెన్సింగ్ ను నిర్మిస్తున్నారు  . 2015 నుండి ఫ్రాన్స్ లో ఉగ్రవాదుల కాల్పులలో దాదాపు 240 మంది మృత్యు వాత పడ్డారు . ఈ నేపధ్యంలో ఈ కంచెను ఏర్పాటు చేశారు . అలాగే ఫ్రాన్స్ దేశంలోని అన్ని పురాతన కట్టడాలకు ఈ విధంగా బులెట్ ప్రూఫ్ కంచెను ఏర్పాటు చేస్తున్నారు .

ఈఫిల్ టవర్ కు ఉత్తర , దక్షిణ వైపులలో పర్యాటకులు వీక్షించేందుకు గ్లాస్ గోడలను ఏర్పాటు చేశారు . మిగతా రెండు వైపులా మెటల్ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశారు . ఒక్కొక్క గ్లాస్ దాదాపు 6 సెంటీమీటర్ల మందంతో , దాదాపు 10 అడుగుల ఎత్తుతో , 1500 కిలోల బరువుతో కూడి ఎలాంటి బాంబు బ్లాస్టింగ్స్ జరిగిన ఈఫిల్ టవర్ ను కాపాడే విధంగా బులెట్ ప్రూఫ్ గ్లాస్ కంచెను ఏర్పాటు చేశారు . ఒక్క వైపు అడ్డం నుండి చాంప్ – డీ – మార్స్ గార్డెన్స్ , మరో వైపు నుండి చూస్తే పారిస్ గుండా వెళ్ళే సైని నది స్పష్టంగా కనపడతాయి . 2015 నవంబర్ నుండి ఫ్రెంచ్ మిలిటరీ దళాలు , పోలీసులు ఈ ప్రాంతం అంతా పహారా కాస్తున్నారు . ఈ సంవత్సరం సెప్టెంబర్ కల్లా ఈ గ్లాసు కంచె నిర్మాణ పనులు పూర్తవుతాయి  .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments